Sunday, April 28, 2024
- Advertisement -

కల్కి..టీజర్ డేట్ లీకైంది!

- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది.

సంక్రాంతి కానుకగా అంటే రేపు టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. టీజర్ , రిలీజ్ డేట్ కి సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ దాదాపు 1 నిమిషం 23 సెకెన్ల నిడివితో ఉండబోతుందని తెలుస్తోండగా మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

గతంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి సినిమాలు మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి. అందుకే అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారట మేకర్స్‌. సూపర్ హీరోగా కాన్సెప్ట్ తో ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ అంతా ఓ మాయలా ఉండనుందట. అలాగే టీజర్‌తో అందరిని ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారట. మొత్తంగా ప్రభాస్ కల్కికి సంబంధించిన టీజర్‌ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -