Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ సీక్వెల్ లో నందమూరి హీరో ?

- Advertisement -

కళ్యాణ్ రాం – పూరీ జగన్నాథ్ ఇద్దరికీ ఒకే రకమైన పరిస్థితి నడుస్తోంది. గెలుపు ఓటముల మధ్యన పడుతూ లేస్తూ ఇద్దరూ కొత్త పయనం లో సాగుతున్నారు . పోయిన ఏడాది టెంపర్ హిట్ ఇచ్చిన పూరీ , అదే ఏడాది పటాస్ తో సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రాం ఇద్దరూ కలిసి సినిమా చేస్తూ ఉండడం విశేషం.

కథల ఎంపిక విషయంలో కళ్యాణ్ రాం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఈ మధ్యన , పూరీ సినిమాకి సంతకం పెట్టారు అంటే పెద్ద హీరోల లిస్టు లో తాను కూడా ఉండడం కోసం ఉవ్విళ్ళు ఊరుతున్నారు అని చెప్పచ్చు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ స్వీయ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్రికేయుడు (జర్నలిస్ట్)గా కనపడనున్నాడట. కళ్యాణ్ రామ్ కి ఇదో కొత్త పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక దర్శకుడు పూరి అయితే కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ తో మైక్ పట్టించి ఎన్నో అంశాలను ప్రస్తావించి రాజకీయ మీడియా రంగాలపై ఓ బాంబ్ ను విసిరారు, ఆ సినిమాకి మంచి పేరొచ్చింది. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ రామ్ చేతికి మైక్ ఇస్తున్నారంటే.. ఆ సబ్జెక్ట్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటోందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో రాంబాబుగా మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి. కెమెరా మ్యాన్ రాంబాబు 2 గా ఈ సినిమాని పూరీ – కళ్యాణ్ రాం లు తీస్తారా అని సందేహాలు ఒస్తున్నాయి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -