- Advertisement -
తెలుగు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు లోక నాయకుడు కమల్ హాసన్.ఆయన తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహారిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.మరి ఆయనకు తెలుగు బిగ్‌బాస్‌లో ఏం పని అనే కదా మీ డౌట్.కమల్ తాజాగా నటించిన చిత్రం ‘విశ్వరూపం 2. ఈ సినిమాను తమిళ,తెలుగు భాషలలో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కమల్.
హోస్‌లోని పోటీదారులతో కాసేపు గడిపి తమ సినిమా ప్రత్యేకతల గురించి చెప్పనున్నారు.ఆయన ఎంట్రీతో షో మరింత వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు.మరి కమల్ ఎంట్రీ శనివారం ఉంటుందో,లేక ఆదివారం ఉంటుందో వేచి చూడాలి.ఇక తమిళ బిగ్‌బాస్‌తో పోలిస్తే తెలుగు బిగ్‌బాస్‌లో కాస్తా గొడవలు తక్కువే.