Monday, April 29, 2024
- Advertisement -

ట్రెండింగ్‌..పుష్ప2లో కోలీవుడ్ హీరో!

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ మూవీ పుష్ప 2. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా 2024 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ కన్ఫామ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఇప్పటికే విడుదలైన వేర్ ఇస్ పుష్ప వీడియో అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర రూమర్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరో కార్తీ పేరు పరిశీలనలోకి వచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఫ్యాన్స్‌కు కన్నుల పండగే.

పుష్ప సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే క్యాస్టింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట సుకుమార్. ఈ నేపథ్యంలోనే కార్తిని ఆ పాత్రకు ఎంచుకోవడం ద్వారా మరింత ప్లస్ అవుతుందని భావించారట. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

2021లో విడుదలైన పుష్ప బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . బన్నీ కెరీర్ లోనే అతిపెద్ద విజయం సాధించడంతో ఈ మూవీలో నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -