నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం ముద్దు గుమ్మ కీర్తి సురేష్. భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె గ్లామర్ షోకు నో చెప్పడంతో పలు అవకాశాలు మిస్ చేసుకుంది. అందులోను రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలలో కూడా ఉన్నాయి.
కానీ ఆమె గ్లామర్ షో చేయకపోయియన్ తన టాలెంట్ చూసి కోలీవుడ్ హీరోస్ విజయ్, ధనుష్ , శివకార్తికేయాన్ ఇలా అంతా అవకాశాలు ఇచ్చారు. కానీ టాలీవుడ్ లో టాలెంట్ కంటే గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని గ్రహించిన కీర్తి సురేష్ తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొంది.
అందులో ఆమె ఆమె వేషధారణ, ఫోజులు అద్భుతంగా ఉన్నాయని… గ్లామర్ షో, అందాల ఆరబోతతో ఆమె అదిరిపోతోందని అంటున్నారు. అంటే కీర్తి సురేష్ గ్లామర్ షోకు కూడా సిద్ధమే అనే సంకేతాలను దర్శకనిర్మాతలకు అందించిందని అంటున్నారు. దీంతో ఈ భామకు ఇకముందు టాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు రావడం ఖాయమంటున్నారు.
