Thursday, May 8, 2025
- Advertisement -

చెర్రికి కూడా మహేష్ డైరెక్టర్ కావాలట!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా అప్పట్లో చాలా గ్రాండ్‍గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఐతే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. అదే టైమ్‍లో రామ్ చరణ్ గోవిందుడు అందరివాడు తో బిజీ అయిపోగా, శివ మహేష్ బాబు తో శ్రీమంతుడు మొదలెట్టారు. ఇక రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‍లో సినిమా రాదు అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‍లో సినిమా రాబోతుంది అంటుంది సినీ పరిశ్రమ. ఐతే రీసెంట్‍గా రామ్ చరణ్ కొరటాల కలిసి మాట్లాడారట. కొరటాల కూడా చాలా సంతోషంతో రామ్ చరణ్‍తో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాడట. చెర్రి కోసం ఓ అద్భుతమైన కథ సిద్దం చేయబోతున్నాడట.

ప్రస్తుతం కొరటల ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటల, చెర్రి కాంబినేషన్‍లో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ రీమెక్ లో నటిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో గాని లేదా కొరటాలతో గాని చరణ్ సినిమా ఉండోచ్చని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -