Sunday, May 4, 2025
- Advertisement -

తండ్రి చనిపోయినా..షూటింగ్‌కు!

- Advertisement -

కోవై సరళ..కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోని తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడు సార్లు అందుకోగా తెలుగులో ఓరి నీప్రేమ బంగారం కానూ అనే సినిమాకు నంది ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకున్నారు.

అయితే కొంతకాలంగా వెండితెరకు దూరమై..రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది కోవై సరళ. బాక్ అరణ్‌మనై 4..సినిమాలో నటించింది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాం లో పాల్గొంది కోవై సరళ.

ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను సినిమాల్లోకి వెళ్తా అంటే నాన్న సపోర్టు ఇచ్చారని, ఆయన మిలటరీలో పనిచేసే వారన్నారు. నాతో ఫ్రెండ్ లా ఉండేవారు…. ఫ్యామిలీ సినిమా షూటింగ్ కి ఊటీ వెళ్ళాలి. ఆ ముందు రోజు అర్ధరాత్రి మా నాన్న చనిపోయారు అని చెబుతూ ఎమోషన్ అయ్యారు. ఆయన్ని వదిలి వెళ్ళలేను. కానీ నాన్న అంత్యక్రియలు అవ్వగానే షూటింగ్ కి వెళ్ళాను అని తెలిపింది. నాన్న చనిపోయిన బాధ ఉన్నా నా కోసం షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు అని షూటింగ్ కి వెళ్లి కామెడీ సాంగ్ లో నటించానని చెబుతూ కంటతడి పెట్టారు కోవై సరళ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -