Monday, May 6, 2024
- Advertisement -

అభినేత్రి 2 రివ్యూ

- Advertisement -

ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ‘దేవి’ సినిమా తెలుగులో ‘అభినేత్రి’ అనే టైటిల్ తో విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ గా ‘అభినేత్రి 2’ సినిమా ఇవాళ అనగా మే 31న విడుదలైంది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జి.వి. ఫిలిమ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మించాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా మేప్పించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూద్దామా..

కథ:
కృష్ణ (ప్రభుదేవా) మరియు దేవి (తమన్నా) దంపతులు పెళ్ళి చేసుకొని సుఖంగా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే వారి జీవితం సాఫీ గా సాగిపోతున్న తరుణం లో అనుకోని విధం గా కృష్ణ ని రంగా రెడ్డి, మరియు అలెక్స్ అనే రెండు దయ్యాలు ఆవహిస్తాయి. దీని వలన కృష్ణ కొన్ని తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొంటాడు. అయితే కృష్ణ కి మాత్రం తనని దయ్యాలు ఆవహించిన విషయం తెలియదు. ఆ సందర్భం లో దేవి ఇదంతా గ్రహించి ఆ దయ్యాల తో ఒక డీల్ కుదుర్చుకుంటుంది. ఏంటి ఆ డీల్? ఆ దయ్యల వలన కృష్ణ కి ఏం వచ్చాయి? ఈ దయ్యాల కథ ఏంటి? అనేది సినిమా లో చూడాలి.

నటీనటులు:
ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా ప్రభుదేవా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తాడు. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో ప్రభుదేవా పాత్ర లో పర్ఫామెన్స్ కి మరింత స్కోప్ ఉండటంతో ప్రభుదేవా తన నటనతో ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాలో తన అందచందాలతో మాత్రమే కాకుండా తన అద్భుతమైన నటనతో కూడా మెప్పించింది తమన్నా. నందిత శ్వేత కి ఈ సినిమాలో ఒక మంచి పాత్ర దక్కింది. తను కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. డింపుల్ హయతి నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. కోవై సరళ కామెడీ ఈ సినిమాకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. గురు సోమసుందరం, దర్శన్ జరీవాలా కూడా ఈ సినిమాలో మంచి నటనను కనబరిచారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
‘అభినేత్రి’ సినిమా లాగానే సీక్వెల్ లో కూడా కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ పై దృష్టి పెట్టినట్లు అనిపించింది. జి.వి.ఫిలిమ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలు తగిన అమౌంట్ సినిమా కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. సామ్ సి ఎస్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ గా మారింది. పాటలు మాత్రమే కాకుండా నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. అయనంక బోస్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఆంటోనీ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ సినిమా కోసం మరొక మంచి కథలు సిద్ధం చేసి మన ముందుకు వచ్చారు. అయితే మొదటి భాగం లాగా కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసి ఉంటె బాగుండేది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ నెరేషన్ వీక్ అవ్వడం వలన సినిమా చాలా త్వరగా బోర్ కొడుతుంది. సింపుల్ కథ అయినప్పటికీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ లను జోడించి ప్రేక్షకులను మెప్పించాడు. అది సినిమా కి ఒక ప్లస్ పాయింట్. మొదటి భాగం తో పోలిస్తే ఈ సినిమాలో కొత్తగా ఏమీ కనిపించలేదు. మొదటి భాగం లో ఏదైతే కామెడీ, ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ మరియు హారర్ ఎలిమెంట్లు ఉన్నాయి అని అనుకున్నామో ఇందులో కూడా అవే ఉండటం వలన చూసేవాళ్ళకి పెద్దగా థ్రిల్లింగ్ గా ఈ సినిమా ఉండకపోవచ్చు. ‘అభినేత్రి’ సినిమా ఎక్కడ ఎండ్ అయిందో ‘అభినేత్రి 2’ సినిమా అక్కడే మొదలవుతుంది. ఈ సినిమాలో నటీనటులు, సంగీతం, కామెడీ ప్లస్ పాయింట్లుగా పరిగణించవచ్చు. కొన్ని సీన్లలో కామెడీ బలవంతంగా నవ్వు తెప్పించాలని పెట్టినట్లు అనిపించినప్పటికీ సినిమా లో నటీనటుల పర్ఫార్మెన్స్ వలన అది పెద్దగా బాధ అనిపించదు. దర్శకుడు విజయ్ తాను అనుకున్న కథ ని సరిగా కన్వే చేయడం లో పూర్తిగా విజయం సాధించినట్లు అనిపించదు. ఓవరాల్ గా ‘అభినేత్రి 2’ సినిమా కామెడీ చిత్రాలను ఇష్టపడే వారిని కచ్చితంగా అల్లరిస్తుంది కానీ ఆశించడానికి మాత్రం ఏమి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -