Thursday, May 2, 2024
- Advertisement -

నాకు చాలా మందితో ఎఫైర్ ఉంది : లక్ష్మీ రాయ్

- Advertisement -

టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో చేసినప్పటికి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇక ఐటెం సాంగ్స్ తో నెట్టికొస్తోంది అందాలా పొడువు సుందరి లక్ష్మీ రాయ్. ఈమె ఎప్పుడు వివాదస్పద కామెంట్స్ తో లైమ్ లైట్ లో ఉంటుంది. అయితే ఈమె చేసే ఐటెం సాంగ్స్ తో బాలీవుడ్‌లో జూలీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

అయినా అమ్మడికి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. తనకు వచ్చిన ప్రతి చాన్స్ ని లక్ష్మీ రాయ్ పూర్తిగా వినియోగించుకుంటోంది. ఇక ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దాంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో తనకు చాలా మందితో ఎఫైర్ ఉందని, వారితో డేటింగ్ చేసి విడిపోయానని ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నానని చెప్పింది.

ప్రస్తుతం కెరీర్‌పైనే తన ఫోకస్ ఉందని ఆమె తెలిపింది. ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఇతరులు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మి.. తనలాగే చాలా మంది కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారని లక్ష్మీ రాయ్ చెప్పుకొచ్చింది. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150లో ‘రత్తాలు రత్తాలు’ అనే పాటతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ఐటం సాంగ్స్ చేస్తోంది లక్ష్మీ రాయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -