Thursday, May 8, 2025
- Advertisement -

మహేష్ అన్నది పవన్ నేనా?

- Advertisement -

పెళ్లాలకు నమ్మకంగా ఉండని మొగుళ్ళంతా.. ఫూల్స్. ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ఈ కామెంట్.. ఇండస్ట్రీలోనే కాదు. బయట కూడా హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ ఎప్పుడూ నమ్రతకు విధేయంగా ఉంటాడు. పక్కా ఫ్యామిలీ మ్యాన్.

షూటింగ్ అయిపోతే.. ఇల్లు పెళ్లాం పిల్లలు తప్ప మరేదీ తెలియదు. ఇది అందరికీ తెలిసిందే అయినా.. ఎన్నడూ ఇంత ఓపెన్ గా ఫ్యామిలీ రిలేషన్స్ పై మాట్లాడింది లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత కామెంట్ చేయడం వెనక అసలు ఉద్దేశం ఏమై ఉంటుందన్నది కొందరి డౌట్.

ఈ విషయంపై ఆరా తీస్తే.. ఒక్కొక్కరు ఒక్కోలా రిప్లై ఇస్తున్నారు. మహేష్ కామెంట్లు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే అని కొందరు డౌట్ పడుతున్నారు. ఇప్పటికే పవన్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం.. ఫ్యామిలీ లైఫ్ సరిగా మెయింటైన్ చేయకపోవడంపైనే ఇన్ డైరెక్ట్ గా మహేష్ కామెంట్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

మహేష్ చేసిన ఈ కామెంట్లు ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపితే.. అదర్ ఎండ్ లో పవన్ ఫ్యాన్స్ ను మాత్రం డిజప్పాయింట్ చేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే చాలా విషయాలపై.. పవన్, మహేష్ ఫ్యాన్స్ మధ్య డిబేట్ నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇది ఓ రేంజ్ లో కనిపిస్తుంటుంది. ఇప్పుడు.. మహేష్ కామెంట్లు.. మళ్లీ ఎలాంటి గొడవకు కారణమవుతాయో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -