Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కోసం మహేష్ మరో సహాయం!

- Advertisement -

ఒక సినిమా హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే కథ, కథనం మాత్రమే సరిపోదు. అందులో స్టార్ ఎట్రాక్షన్ కూడా ఉండాలి. అలాగే సెంటిమెంట్ కూడా మిక్స్ అయ్యి ఉండాలి. సో అప్పుడు సినిమాపై భారీ అంచనాలు పెరిగిపొతాయి. అసలు విషయాన్నికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఓ సరి కొత్త కథతో మన ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్.

అలాగే ఈ సినిమాలో స్టార్ ఎట్రాక్ష్ తో నింపేశాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ఓ సెంటిమెంట్ కూడా యాడ్ చేశాడు. అదే మహేష్ సెంటిమెంట్. అవును… యంగ్ టైగర్ సినిమాకు సూపర్ స్టార్ పనిచేయబోతున్నాడు. జనతా గ్యారేజీ సినిమాకు వాయిస్ ఓవర్ అందించేందుకు మహేష్ అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. సినిమాకు ఇది కచ్చితంగా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. అంతేకాదు… సెంటిమెంట్ గా కూడా నిలవనుంది. ఎందుకంటే…మహేష్ ఏ సినిమాకైనా గొంతు అరువిచ్చాడంటే అది కచ్చితంగా హిట్టే. గతంలో జల్సా, బాద్ షా సినిమాల విషయంలో అది నిజమైంది.

తొలిసారిగా జల్సా సినిమా కోసం ఇలా వాయిస్ ఓవర్ ప్రయత్నించాడు మహేష్. త్రివిక్రమ్ అడగడంతో కాదనలేకపోయాడు. రిజల్ట్ అదిరిపోయింది. పవన్ యాక్టింగ్ కు అక్కడక్కడ మహేష్ గొంతు కూడా తోడవ్వడంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన బాద్షా కు కూడా వాయిస్ అందించాడు మహేష్. శ్రీనువైట్ల అడగడంతో కాదనలేకపోయాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్టయింది. ఇప్పుడు కొరటాల శివ అడగడంతో జనతా గ్యారేజీకి గొంతు అందించడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు తనకు అందించిన కొరటాల రిక్వెస్ట్ చేయడంతో మహేష్ కాదనలేకపోయాడట. సో… సెంటిమెంట్ ప్రకారం జనతా గ్యారేజీ కూడా హిట్ అవ్వాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -