- Advertisement -

మహేష్ స్టార్ ఢం కంటే నా స్టార్ పవర్ ఏం తక్కువ….. బన్నీ ఆగ్రహం

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ అంటే అంతే. మా అందరిదీ ఒకటే కుటుంబం అని మీడియా కెమేరాల ముందు బ్రహ్మాండంగా నటిస్తూ ఉంటారు కానీ తెరవెనుక వ్యవహారాలు మాత్రం పూర్తి రివర్స్‌లో ఉంటూ ఉంటాయి. టిడిపిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన పవన్ కళ్యాణ్‌ని…….పవన్ కళ్యాణా…..ఎవడు వాడు….వాడెవడో నాకు తెలియదు అన్న స్థాయిలో రెచ్చిపోయి విమర్శలు చేశాడు బాలయ్య. అంతకుముందు చిరంజీవి, చరణ్‌లపై కూడా సెటైర్స్ వేశాడు. చివరికి అఖిల్‌ని కూడా వదల్లేదు. బాలయ్య, మోహన్‌‌బాబు లాంటి వాళ్ళు మనసులో ఉన్న మాటలను డైరెక్ట్‌గా చెప్పేస్తూ ఉంటారు.

ఇక చిరంజీవి, అల్లు అరవింద్‌లాంటి వాళ్ళు తెరవెనుకే అన్నీ చేసేస్తుంటారు అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారం ఒకటి నడుస్తోందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలు అందరికంటే కూడా మహేష్ బాబుది డిఫరెంట్ స్టైల్. హీరోయిన్స్‌ని ఫాం హౌస్‌లకు రప్పించుకోవడాలు, ఇండస్ట్రీపైన ఆధిపత్యం చూపించాలని ట్రై చేయడాలు లాంటివి అస్సలు ఉండవు. సినిమా ఏంటి? నా రెమ్యూనరేషన్ ఎంత? అన్న విషయాలకే పరిమితమవుతాడు. సూపర్ స్టార్ కృష్ణ కూడా సేం టు సేం. అందుకే ఘట్టమనేని వంశానికి సినిమా ఇండస్ట్రీ రాజకీయాల్లో పెద్దగా గ్రిప్ కనిపించదు. కానీ మంచిపేరు ఉండడంతో అవసరమైనప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఫేవర్ చేయడానికి రంగంలోకి దిగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా భరత్ అను నేను సినిమాతో పోటీ పడడం ఎందుకు? నా పేరు సూర్యను రెండు వారాలు పోస్ట్ పోన్ చేసుకుంటారా? ఇద్దరూ నష్టపోయే పరిస్థితులు తప్పుతాయి? మధ్యలో బయర్స్‌మి బలవుతాం అని కొంతమంది పెద్దలు బన్నీని అప్రోచ్ అయ్యారట. ఆ వెంటనే బన్నీ రియాక్షన్ వాళ్ళను షాక్‌కి గురిచేసింది. ‘నా సినిమా ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి? ఫస్ట్ నన్నే ఎందుకు అడుగుతున్నారు? మహేష్ కంటే నా నేను ఏం తక్కువ? నా స్టార్ ఢం ఏం తక్కువ’ అని కౌంటర్ ఇచ్చాడట బన్నీ. ఆ దెబ్బతో షాక్ తిన్న పెద్దలు అల్లు అరవింద్‌ని కలిశారట.

ప్రస్తుతం అల్లు అరవింద్ ఈ పంచాయతీని తేల్చేసే ప్రయత్నంలో ఉన్నారట. ఈ ఇష్యూని అల్లు అరవింద్ సాల్వ్ చేస్తే బన్నీ సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని వేరే చెప్పాలా? ఇక భరత్ అను నేను సినిమా బ్లాక్ బస్టర్ కంటెంట్‌తో…..కొరటాల బెస్ట్ వర్క్‌తో వస్తే ఇలాంటి పాలిటిక్స్ ఎన్ని ఉన్నా సినిమా లవర్స్ అంతా భరత్ అను నేను నిలబెట్టేస్తారు. అలాగే నా పేరు సూర్య కంటెంట్ వీక్‌గా ఉన్నా కూడా మహేష్ బ్రతికిపోతాడు. అలా కాకుండా రెండూ యావరేజ్ సినిమాలే అయితే మాత్రం కచ్చితంగా అది నా పేరు సూర్యకు అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి పాలిటిక్స్ చూసే మహేష్ కూడా సొంతంగా స్టూడియో, సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లోకి దిగాలని ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన నమ్రతా కూడా ఈ విషయం సీరియస్‌గా ఆలోచిస్తుందట. నెక్ట్స్ మహేష్ కొడుక్కి కూడా హెల్ప్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఏం చేసినా మెగా ప్లాన్స్‌ని మహేష్ తట్టుకోగలడా? అది కూడా అల్లు అరవింద్ గేమ్‌ని…..చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -