తెరపై ఎన్నో మంచి సీన్స్ కనిపిస్తాయి. కానీ తెరవెనక జరిగే సీన్స్ ఎవరికి తెలియవు. టాలీవుడ్ లో తెరవెనక జరిగిన తీవ్రమైన ఘటనలో ఇప్పుడు చదవబోయేది ఒకటి. మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి మోహన్ బాబు ఎంత డిసిప్లిన్ గా ఉంటారో.. ఆయనకు ఎంత కోపమో అందరికి తెలిసిందే.
ముక్కుసూటిగా వ్యవహరించే ఈ కలెక్షన్ కింగ్ అనేక సార్లు అనేక మంది నటులు, ఇతరత్రా చిత్ర పరిశ్రమ ప్రముఖులతో బహిరంగంగానే వాదులాటకు దిగారు. ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణుమొదటి మూవీ విష్ణు ని ఒక బాలీవుడ్ భామ చెల్లెలితో చేశారు. షూటింగ్ అంతా బాగానే జరుగుతుండగా.. ఒక రోజు.. షూటింగ్ చూడటం కోసం మోహన్ బాబు అక్కడికి వెళ్లారు. అప్పుడు హీరో, హీరోయిన్ ని ముద్దు పెట్టే సీన్ చేస్తున్నారు. కాగా హీరోయిన్ మాత్రం ఎన్ని సార్లు తీసినా సరిగా ముద్దు పెట్టడం లేదట. దాంతో విష్ణుతో పాటు దర్శకుడుతో సహా అందరికి మహా చిరాకు వచ్చేసిందట. ఇక మోహన్ బాబు కి కోపం పెరిగిపోయి.. ఇక అంతే ఆ హీరోయిన్ చెంప చెల్లుమని మోగిందట. ఇక ఆ హీరోయిన్ ఏడ్చుకుంటూ.. అక్కడ నుంచి వెళ్లిపోయిందట. ఇక అందరూ ఆమెని సముదాయించి మళ్లీ షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత టేక్ లో ఆమె బాగా చేసింది. ఇక అందరూ అప్పుడప్పుడు అలా కొట్టాల్సి వస్తోందని వదిలేశారు. ఆ హీరోయిన్ కూడా ఆ విషయంను తర్వాత పెద్దగా పట్టించుకోలేదట. కానీ.. ఈ విషయం ఇటివలే సినీ వర్గాల్లో తెగ హల్ చల్ చేస్తోంది.
