- Advertisement -

ధనుష్‌తో పెళ్లి..మృణాల్ క్లారిటీ ఇచ్చేసింది!

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో పుకార్లు కొత్తేమీ కాదు. ముఖ్యంగా హీరో–హీరోయిన్లు బయట కలిసి కనిపిస్తే, వారి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందంటూ రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. కొన్నిసార్లు అవి నిజమైనా, ఎక్కువశాతం మాత్రం ఊహాగానాలే. అలాంటి పుకార్లలో ఇటీవల ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పెళ్లి వార్తలే.

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకుల అనంతరం ధనుష్ మృణాల్ ప్రేమలో పడ్డాడని, ఇద్దరూ కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచారం చేసింది. ధనుష్–మృణాల్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మృణాల్ వీడియోలకు తమిళ్ పాటలు వాడటం, ఈ రూమర్స్‌ను లైట్‌గా తీసుకోవడం చూసి నిజమే అనుకున్నవారు కూడా ఉన్నారు.

అయితే తాజాగా మృణాల్ ఈ ప్రచారానికి చెక్ పెట్టింది. తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ, ధనుష్ తనకు అన్నయ్య లాంటివాడని స్పష్టం చేసింది. తమ మధ్య పరస్పర గౌరవం, వృత్తిపరమైన అనుబంధం తప్ప ఇంకేమీ లేదని తేల్చిచెప్పింది. తన వ్యక్తిగత జీవితం గురించి అసత్య కథనాలు సృష్టించడం బాధాకరమని, తనను తన పని ద్వారానే గుర్తించాలని కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -