పవన్ కళ్యాన్ నటించిన అజ్ణాత వాసి సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్సన్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమయిన సంగతి తెలిసిందే. సినిమా భారీగా హిట్ అవుతాదనే అంచనాలతో మరో మూవీకి మైత్రిమూవీ మేకర్స్ దగ్గర పవన్ 12 కోట్లు ఆడ్వాన్స్ తీసుకున్నారంట. అయితే పవన్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్స్ అంటూ వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇక నుంచి సినిమాలు మానేసి పూర్తి సమయం రాజకీయాలకు ఉపయోగిస్తానని ప్రకటించారు.
అయితే గత రెండు రోజులుగా మీడియాలో పవన్ గురించి ఓ వార్త హాట్ టాపిక్ గా నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పవన్‌కళ్యాణ్‌కు 12కోట్లు అడ్వాన్స్ .వాళ్లు తిరిగి వడ్డీతో కలిపి ఇవ్వమంటున్నారని. ..దానికి పవన్ షాక్ అయ్యారంట అందులో ఎంత నిజముందో తెలియదు.
ఫిలిమ్ ర్గాల్లో టాక్ ప్రకారం ఎన్టీఆర్ తో రభస తీసిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌తో సినిమా నిర్మించాలని మైత్రి మూవీస్ వారు కథ కూడా సిద్ధం చేయించారట. పవన్ కూడా ఈ కథకు ఓకే చెప్పాడట. అయితే 2019 ఎన్నికలకు సన్నాహకంగా ప్రచారం ప్రారంభించిన జనసేనాని ఇక మీదట సినిమాలు చెయ్యనని ప్రకటన చేసారు.
దీంతో తమ అడ్వాన్స్ తిరిగి ఇచ్చెయ్యమని పవన్‌ను కోరిందట మైత్రీ మూవీ మేకర్స్. పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యనని చెప్పాడు కాబట్టి, ఇంకా అడ్వాన్స్ ఉంచడం అనవసరం అని డిసైడ్ అయిన మైత్రీ మూవీస్ అధినేతలు వడ్డీతో సహా తమ డబ్బులు ఇచ్చెయ్యమని అడిగారట. మరి అగ్రిమెంట్ ఎలా రాసుకున్నారో కానీ, 12 కోట్లకు వడ్డీ 8 కోట్లు అయ్యిందని మొత్తంగా 20 కోట్లు ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పారట.
అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు అంటున్నారు అభిమానులు. పవన్ చాలా నిజాయితీగా ఫెయిర్ గా ఉంటారని, నిజంగా అడ్వాన్స్ తీసుకుంటే కనుక.. వడ్డీతో తిరిగి వెనక్కి ఇవ్వటానికి క్షణం కూడా ఆలోచించరని… ఇవన్నీ గిట్టనివాళ్లు పవన్ పై పుట్టిస్తున్న రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు. మరి దీనిలో ఎంత నిజముందో తెలియదు.