Sunday, May 4, 2025
- Advertisement -

నాగచైతన్యకి ఇలాంటి ఒక సమస్య ఉందని తెలుసా..?

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య.. త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తాజా చైతు నటించిన యుద్ధం శరణం ప్రస్తుతం.. థియేటర్లో సందడి చేస్తోంది. ఈ సినిమా తర్వాత కాస్తా గ్యాప్ తీసుకుని.. ఏయన్నార్ జయంతి సందర్భంగా తన కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నాడు నాగచైతన్య. ఈ మూవీకి సవ్యసాచి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు.

యువ డైరెక్టర్ చందు మొండేటి తెరకెస్తున్న ఈ మూవీలో నాగచైతన్య ఓ డిఫరెంట్ సమస్యతో బాధపడుతూ ఉంటాడట. సాధారణంగా.. సవ్యసాచి అని అర్జునున్ని అంటారు. బాణాలను ఎడమ, కుడి రెండు చేతులతో వేయగల సామర్థ్యం తనకు సొంత గనుక ఆయనకు ఈ పేరు వచ్చింది. అయితే ఈ మూవీలో సవ్యసాచికి ఒక చెయ్యి మాత్రమే తన ఆధీనంలో ఉంటుందట. కుడి చేయి ఎంత బలంగా ఉందో.. ఎడమ చేయి కూడా అంతే బలంగా ఉంటుందట. అయితే దాని మీద అతనికి నియంత్రణ ఉండదట. అంటే ఒక చేయి తన నిర్ణయం తానే తీసుకుంటుందట. ఇదంత గమనిస్తే.. హలో బ్రదర్ మూవీలో నాగార్జున చేయి కూడా ఎవరైనా వంగితే ఇలానే ప్రవర్తిస్తుంది.

అయితే ఆ సినిమాలో అలా కామెడీ కోసం పెట్టినా.. ఈ సినిమాలో మాత్రం సీరియస్ గా అదే కాన్సెప్ట్ ను అంతకు మించి క్యారీ చేస్తున్నారు. ఈ చెయ్యి స్వతంత్రంగా ప్రవర్తించడం వల్ల నాగచైతన్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, ఏ చేయగలిగాడనేదే స్టోరీ. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరగనుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన అనుపమ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -