Wednesday, May 15, 2024
- Advertisement -

నాగబాబు కు ఎక్కడా లేని కోపం వచ్చిందట!

- Advertisement -

టివి షో తో మంచి పాలోయింగ్ తెచ్చుకుంది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిల్మ్ తో యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీంతో నిహారికకు మంచి పాలోయింగ్ వచ్చింది. సో అక్కడితోనే కాకుండా ఇప్పుడు హీరోయిన్‍గా కూడా రాబోతుంది. ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.

ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తుండగా.. రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తన ముద్దుల కూతురు నిహారిక కు నాగబాబు వార్నింగ్ ఇచ్చాడట ! కూతురు సినిమాల్లోకి వస్తానంటే ముందుగా అలోచించిన… తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగబాబు కు నిహారిక పై అంతగా కోపం ఎందుకు వచ్చిందో తెలుసా….  మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఆఫర్లు వస్తుండటంతో కథ వినకుండానే కొంతమంది దగ్గర అడ్వాన్స్ లు పుచ్చుకుందట నిహారిక దాంతో నాగబాబు కు ఎక్కడా లేని కోపం వచ్చిందట.

కథ నచ్చకుండా సినిమా చేయొద్దు, అడ్వాన్స్ తీసుకోవద్దు ఎందుకంటే టాప్ స్టార్స్ సినిమాలు సైతం కథ లేకుంటే ప్రేక్షకులు చూడటం లేదంటూ పవన్ ”సర్దార్ గబ్బర్ సింగ్ ” గురించి అలాగే మహేష్ ”బ్రహ్మోత్సవం ” గురించి మరీ చెబుతున్నాడట. అడ్వాన్స్ లు తీసుకోవలసిన అవసరం లేదని మంచి కథ తో వస్తే తప్పకుండా చేయొచ్చని అంతేకాని కథ లు వినకుండా డబ్బులు తీసుకుంటూ ఓకే చెప్పొద్దని హితువు పలికాడట నాగబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -