Monday, April 29, 2024
- Advertisement -

నాని మోత మోగిస్తున్నాడు!

- Advertisement -

నిన్న రిలీజ్ అయిన నాని ‘క్రిష్ణగాడి వీరప్రేమ గాధ’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి మంచి ఓపనింగ్స్ రాబట్టింది. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన మేహ్రీన్ హీరోయిన్‍గా నటించింది.

ఎవడె సుబ్రహ్మణ్యం వంటి హిట్ తర్వాత భలే భలే మగాడివోయ్ తో కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న నాని  ఇప్పుడు మరోసారి ”కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ” తో హిట్ కొట్టి హ్యాట్రిక్ తన ఖాతలో వేసుకున్నాడు. ఈ సినిమాలో నాని బాలయ్య అభిమానిగా నటించాడు. ఐతే మొదటి నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.

మంచి ప్రేమకథలో యాక్షన్ జోడించి తీసిన ఈ సినిమా మొదటి రోజు నాని కెరియర్‍లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి అని అంటున్నారు. బి సి సెంటర్లలో సమానంగా నాని మొదటి రోజు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మంచి ప్రేమ కథకి త్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి నడిపించిన విధనంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -