సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలతో పోటీలోకి దిగిన నాన్నకు ప్రేమతో సినిమా ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్టీఆర్ స్టైలీష్ నటనతో మరోసారి ట్రెండ్‍ని క్రియేట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ అద్భుతమైన నటన, సుకుమార్ దర్శకత్వం పై సినీ ప్రముఖులనుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ వసులు చేస్తుంది. ఇక్కడే కాకుండా యూఎస్‍లో కూడా ఇప్పుడు ఈ సినిమాకి రికార్డ్ కలక్షన్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తరింటికి దారేది’ సినిమాని నాన్నకు ప్రేమతో సినిమా బ్రేక్ చేసింది. ‘అత్తరింటికి దారేది’ 1.89 మిలియన్ వసులు చేయగా నాన్నకు ప్రేమతో సినిమా 1.91 మిలియన్ వసులు చేసి పవన్ సృష్టించిన రికార్డ్‌ను బ్రేక్ చేసాడు ఎన్టీఆర్.
యూస్ లో మొదటి స్థానంలో ప్రభాస్ బాహుబలి ఉండగా రెండో స్థానంలో మహేష్ బాబు శ్రీమంతుడు ఉంది. ఇప్పుడు పవన్‍ను అదిగమించి ఎన్టీఆర్ మూడో స్థానంలోకి వచ్చాడు. ఎన్టీఆర్, రకుల్ జంటగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ఇప్పుడు ఆల్ టైం ఓవర్సీస్ టాప్ లిస్ట్‌లో చేరిపోయింది. పవన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మహేష్ రికార్డ్‌ను కుడా బ్రేక్ చేస్తాడు అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.