- Advertisement -
నవదీప్ హీరోగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లవ్, మౌళి’. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు A రేటింగ్ ఇచ్చారు. ఈ సూపర్ టాలెంటెడ్ నటుడు సినిమాల నుంచి విరామం తీసుకున్న చాలా రోజుల తర్వాత హీరోగా కనిపించబోతున్నాడు.
నవదీప్ “లవ్, మౌళి” జూన్ 7 న థియేటర్లలోకి రానుంది. లవ్ మౌళి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని…విడుదలకు సిద్ధంగా ఉందని వెల్లడించారు నవదీప్. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా సినిమా ఎలా ఉంటుందో వేచిచూడాలి.