Sunday, May 12, 2024
- Advertisement -

చిరు ఉయ్యాలవాడలో నయనతార..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి.. ఖైదీ సినిమా తర్వాత 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ కథ అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆగష్టు నుంచి జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ను తీసుకునే ఆలోచనలో ఉంది మూవీ యూనిట్. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో పాటుగా నయనతార కూడా ఇందులో హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం మేరకు నయనతార ఈ సినిమాలో కన్ఫాం అయినట్లు సమాచారం. చిరు పక్కన మొదటిసారి నయనతార నటించబోతుంది. 150 ఏళ్ల క్రితం జరిగిన కథను సినిమాటిక్ హంగులతో తెలుగు తమిళ హింది భాషల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ తెరకెక్కిస్తోంది. ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందించబోయే ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఖైది నంబర్ 150తో నిర్మాణ రంగంలోకి దిగిన చరణ్ సెకండ్ సినిమాగా వస్తున్న ఉయ్యాలవాడని కూడా ప్రెస్టిజియస్ గా నిర్మించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం చరణ్, సుకుమార్ తో రంగస్థలం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తునే.. మెగాస్టార్ సినిమాకి సంబంధించిన ఏర్పాటులు చేస్తున్నాడట. చిరు సినిమాలో నటించేందుకు గాను నయన్ కు భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -