Monday, May 13, 2024
- Advertisement -

కీర్తి బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది!

- Advertisement -

నేను శైలేజ సినిమాతో తెలుగులో మంచి విజయం అందుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా న్యూ ఇయర్ రోజు వచ్చి సూపర్ హిట్ అయింది. అందరు కీర్తి నటనకు మంచి మార్కులు వేశారు. అలాగే తమిళంలో కూడా సంక్రాంతికి విడుదలైన ‘రజినీ మురుగన్‌’ సినిమలో కూడా నటించింది.

ఈ సినిమా సూపర్ హీట్ అవ్వడంతో తెలుగు, తమిళంలో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కీర్తికి. ఐతే తెలుగులో భారీ ఆఫర్సే వస్తున్నాయట. ఇందులో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అలాగే తమిళ సూపర్ స్టార్ విజయ్ మాత్రం కీర్తికి తన సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇచ్చాడు.

విజయ 60వ సినిమాగా వస్తున్న సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా ఛాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమాకి భరతన్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఐతే విజయ్ పక్కన చాన్స్ రావడంతో కీర్తి దశ తిరగడం ఖాయం అంటున్నారు తమిళ విశ్లేషకులు. వరసగా అవకశాలు రావడంతో అమ్మడు చాలా సంతోషంగా ఉందట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -