Friday, May 9, 2025
- Advertisement -

దేవుడా….. త్రివిక్రమ్, పవన్‌లకు ఎంతటి దుస్థితి వచ్చింది?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…….ఈ పేరు స్క్రీన్ పైన కనిపిస్తే థియేటర్స్ ఊగిపోయాయి. ఇక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో పవన్ అభిమానుల పవన్ నామ జపం మామూలుగా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఆ హంగామాతో ఇబ్బందిపడ్డవారే. పవన్ సొంత అన్నయ్య……పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అవ్వడానికి కారణమయిన చిరంజీవి ప్రెస్టీజియస్ సినిమా ఫంక్షన్‌లో కూడా పవన్ ఫ్యాన్స్ అందరూ చిరంజీవిని బాధపెట్టారు. ఇక పవన్ పేరును వాడుకోవాలని…..క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించిన హీరోలు, డైరెక్టర్స్ ఎందరో.

కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. అత్తారింటికి దారేది తర్వాత నుంచీ మేజికల్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేసిన త్రివిక్రమ్, పవన్‌లు ఇప్పుడు పూర్తి రివర్స్‌ గేర్‌లో ఉన్నారు. ఆ ప్రభావం మొత్తం నితిన్ సినిమా ఛల్ మోహనరంగాపై పడుతోంది. త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ కథ అందించిన సినిమా అంటే ఈ పాటికి ఓ రేంజ్‌లో బిజినెస్ అయి ఉండాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి నిర్మాతగా మారి తీసిన సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉండాలి? అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్‌లో ఉండాలి? కానీ ఈ ఛల్ మోహన రంగాకు మాత్రం అవేవీ లేవు. సినిమా డిఫిసిట్‌లో రిలీజ్ అవుతోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కూడా యావరేజ్ స్థాయిలో కూడా లేవు.

సినిమా ఇండస్ట్రీ క్రేజ్ ఎప్పుడూ కూడా గబ్బర్‌సింగ్‌లో పవన్ చెప్పినట్టు ఆకాశంలో మబ్బులు లాంటిదే. మేం ఆకాశం లాంటి వాళ్ళం అని అనుకోవడానికి బాగుంటుంది కానీ……నిజజీవితంలో మాత్రం ఎవ్వరైనా ఆకాశంలో ఉండే మబ్బులు లాంటివాళ్ళే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. దానికి మరో ప్రత్యక్ష సాక్ష్యం అత్తారింటికి దారేది రిలీజ్ టైం నుంచీ అజ్ఙాతవాసి రిలీజ్ అయ్యేవరకూ ఉన్న పవన్, త్రివిక్రమ్‌ల క్రేజ్‌కీ……..అజ్ఙాతవాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచీ త్రివిక్రమ్, పవన్‌ కళ్యాణ్‌ల క్రేజ్‌కి ఉన్నతేడానే. త్రివిక్రమ్, పవన్‌లకు ఇంకొకటో రెండో ఫ్లాప్ సినిమాలు పడితే మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఊహించలేం అని ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఆవేదనతో స్పందిస్తూ ఉన్నారు. అంతా మార్కెట్ మాయ అనుకోవాలేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -