Friday, May 10, 2024
- Advertisement -

ఆ హీరో ఎవరో మీకు తెలుసా?

- Advertisement -

సమంత బోయ్ ఫ్రెండ్ ఎవరూ అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా తెలుగు సిని లవర్స్ ని వెంటాడుతోంది. అందుకు కారణం…ఆమె స్వయంగా తనకో లవర్ ఉన్నాడని రివీల్ చేయటమే. అయితే అతను పేరు మాత్రం ఆమె చెప్పలేదు. అంతేకాదు అతనో తెలుగు యంగ్ హీరో అన్నారు. దాంతో ఈ విషయమై అంతటా చర్చ మొదలైంది. ఎవరా యంగ్ తెలుగు హీరో అని. వాటిలో నితిన్, నాగచైతన్య పేర్లు ఎక్కువ నానుతున్నాయి. ఇదే విషయాన్ని నితిన్ ని మీడియావారు అడగటం జరిగింది.

దానికి నితిన్ సమాధానం చెప్పారు.. సమంత ఓ హీరోతో లవ్‌లో ఉన్నారని ప్రచారమవుతోంది కదా… ఆమె మీ ఫ్రెండ్ కాబట్టి.. ఆ హీరో ఎవరో మీకు తెలుసా? అనే ప్రశ్న నితిన్ ముందుంచితే – ”సమంత నాకు ఫ్రెండే. కానీ, తన పర్సనల్ విషయాలు చెప్పుకునేంత కాదు” అన్నారు.

మీడియావారు మరీ పట్టుబట్టే సరికి… మీకందరికీ తెలుసు..ఆమె ఏ హీరోతో ప్రేమలో పడిందో. అందరికి తెలుసు ఆమె బోయ్ ఫ్రెండ్ ఎవరో అని నితిన్ కట్ చేసారు. మళ్లీ నితిన్ సస్పెన్స్ లో పడేసాడు. మనందరికి తెలుసున్న ఆ యంగ్ హీరో ఎవరబ్బా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -