Sunday, May 12, 2024
- Advertisement -

నాకూ అతనికీ అక్రమ సంబంధం లేదు బాబోయ్ ..

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ మీద కొన్ని రోజులుగా పెద్ద వివాదం రేగింది . సల్మాన్ ఖాన్ తమ్ముడుతో ఆమె చాలా క్లోజ్ గా ఉంటోంది అని ఆ క్లోజ్ నెస్ ఈ మధ్య ఇంకాస్త పెచ్చు మీరింది అనేది విమర్శకుల నుంచి వస్తున్న వాదన. మీడియా , టీవీ ఛానల్ లలో ఈ వార్త చూసిన హుమా ఆశ్చర్యపడింది అట.

ఆరా తీయగా అది ముంబై మిర్రర్ అనే పత్రిక చేసిన ఘనకార్యం అని వాళ్ళని ట్విట్టర్ లో చెడుగుడు ఆడేసుకుంది అమ్మడు. గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్, ఏక్ థి దయాన్, డెడ్ ఇష్కియా, బద్లాపూర్ సినిమాలతో బోల్డ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఈ మధ్య సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ ఒకటి రెండు సార్లు మీడియాకి కనిపించిందట.

కానీ ఇంతలో ఇలాంటి వార్తలు రావడంతో అమ్మడికి మండి సదరు పత్రికకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ నాకు అన్నయ్య లాంటి వాడు. ఇద్దరం కలిసినప్పుడు అన్నాచెల్లెళ్ళకి మించి ఆప్యాయంగా ఉంటాం, మీరు మా మధ్య ఇలాంటి సంభందాన్ని అంతగాడతారా అంటూ రెచ్చిపోయింది. మరి ఆ పత్రిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -