Tuesday, May 21, 2024
- Advertisement -

‘జనతా గ్యారేజ్’ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్

- Advertisement -

నాన్నకు ప్రేమతో తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. మిర్చి, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు. రెండు సినిమాల్లోనూ హీరోలను డిఫరెంట్ స్టైల్‌లో చూపించారు. ముఖ్యంగా హీరో లుక్, యాటిట్యూడ్ విషయంలో కొరటాల చాలా కేర్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ ను ఓ రేంజిలో చూపిస్తారని అంచనా వేస్తున్నారు అభిమానులు.

తాజాగా జనతా గ్యారేజ్ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో రీలీజ్ అయింది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయే విధంగా ఉంది. ఇటీవల ముంబైలో ఎన్టీఆర్‌పై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ షూటింగ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -