Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్-4 హోస్ట్ గా ఎన్టీఆర్.. అసలైన ట్విస్ట్ ఇదే..!

- Advertisement -

బిగ్ బాస్ అన్ని సీజన్లకు తెలుగులో మంచి పేరు వచ్చింది. తాజాగా వచ్చిన మూడో సీజన్ కి కూడా రేటింగ్ బాగా వచ్చిందని గతంలో బిగ్ బాస్ యాజమాన్యం తెలిపింది. నిజానికి రెండో సీజన్ కంటే మూడో సీజన్ కు రేటింగ్ చాలా ఎక్కువ. దాంతో బిగ్ బాస్ యాజమాన్యం అలానే స్టార్ మా కూడా అప్పుడే తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ కోసం కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం డిస్కషన్ చేస్తున్నట్లు సమాచారం.

మూడో సీజన్ లాగే నాలుగో సీజన్ కోసం చాలా ముఖ్యమైన సెలబ్రిటీలను తీసుకోవాలని చూస్తున్నారట. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్, సీజన్ 2కి నాని, సీజన్ ౩కి నాగార్జున హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం స్టార్ హోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారట. నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్ కి మంచి టీఆర్పీ రేటింగ్ రావడంతో నాలుగో సిజన్ కి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం ఎన్టీఆర్ తీసుకురావలని నిర్వాహకులు ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది సగంలో రిలీజ్ కానుంది.

ఆ తర్వాత ఎన్టీఆర్ మరో సినిమా చేయడానికి టైం తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఎలాగో బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలువుతుంది. ఎన్టీఆర్ ఎలాగో బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో దిట్టా. కాబట్టి ఈ సారి కచ్చితంగా ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తారని తెలుస్తోంది. అలానే ఎన్టీఆర్ కు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -