బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడా ? బాహుబలి తర్వాత మరో సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడా ? తాజాగా ఇదే టాక్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. బాహుబలి వన్, ఆ తర్వాత బాహుబలి 2తో ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ దాకా షేక్ చేసిన డార్లింగ్ మరో సీక్వెల్ తో అలరించబోతున్నాడట.
ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్ మూవీ రూపొందుతోందన్న విషయం తెలిసింది. అయితే సలార్ చిత్రానికి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రభాస సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు.
అయితే సలార్ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోందని ఎక్కడా వార్తలు రాలేదు. కానీ సలార్ సీక్వెల్ కు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని సమాచారం. ఇదే నిజమైతే డార్లింగ్ అభిమానులకు అది పండుగే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసే సీక్వెల్ మూవీ ఇదే అవుతుంది.
Also Read: మంచి పని చేయబోతే.. రాజమౌళికి ఎదురైన ట్రోల్స్