Thursday, May 8, 2025
- Advertisement -

” తెలుగు వాళ్ళు డబ్బులు టైం కి ఇస్తారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ బెటర్ “

- Advertisement -

పరేష్ రావాల్ ఆయన చెయ్యలేని, చెయ్య జాలని పాత్ర ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. అవలీలగా తన స్టైల్ లో ఎలాంటి పాత్రనైనా చేసేయగల సమర్ధుడు ఆయన. డియర్ ఫాదర్ అనే ఒక నాటకం ప్రదర్శించడం కోసం త్వరలో హైదరాబద్ రాబోతున్నారు ఈయన. ఇక్కడ హైదరాబాద్ కబుర్లు గురించి మాట్లాడుతూ ఇక్కడ సినిమా వారి మీద పొగడ్తల వర్షం కురిపించారు పరేష్.

హైదరాబాద్ ఆడియన్స్ చాలా షార్ప్ గా  ఉంటారు అనీ . కళల కి మంచి ప్రాధాన్యత ఇస్తారు అనీ అంటున్నారు పరేష్. ” బాలీవుడ్ అంటారు కానీ దానికంటే టాలీవుడ్ పరిశ్రమ చాలా ఆర్గనైజ్డ్ గా అనిపిస్తుంది నాకు. డిసిప్లిన్ కూడా చక్కగా ఉంటుంది. అంతా టైం కి వచ్చేసి పని చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పని పూర్తి అవుతూ ఉంటుంది ” అన్నారు పరేష్.

పేమెంట్ గురించి మాట్లాడుతూ ఎప్పటి కప్పుడు చెప్పినట్టుగా డబ్బులు కూడా ఇచ్చేస్తారు అని చెప్పుకొచ్చారు. తెలుగు లో రాం గోపాల్ వర్మ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆయన పవన్ కళ్యాణ్ తీన్ మార్ లో కనిపించడమే ఆఖరు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -