Saturday, May 4, 2024
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో.. పవన్ కళ్యాణ్ అరగంట కనిపించనున్నారట

- Advertisement -

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా అప్పుదే మెగాస్టార్ చిరంజీవి 152 గురించి ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. చిరంజీవి 152 వ సినిమా కోసం ఇప్పటి నుంచే అంత సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాటల మాత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నారట. తాజా న్యూస్ ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ చేయబోతున్నారట. పవన్ పాత్ర ఈ మూవీలో అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ డైరెక్షన్ లో నటించేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నరని.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కాగా పవన్ ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మెరిశారు. శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో పవన్ గెస్ట్ గా మెరిసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా చిరు సైరా మూవీ షూటింగ్ ఇంకా మొదలు కావాలిసి ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -