టాలీవుడ్‍లో పవన్ అత్తారింటికి దారేది రికార్డు సృష్టిస్తే బాహుబలి సినిమా విడుదలై ఈ రికార్డులను అదిగమించి రికార్డుల్లో మొదటి స్థానంలోకి చేరుకుంది. ఎలగైన ఈ సమ్మర్‍లో మరోసారి రికార్డులు సృష్టించడానికి బాహుబలి సెంటిమెంట్ అనుసరించబోతుంది సర్దార్ సినిమా. ఐతే ఈ సినిమా షుటింగ్ ప్రస్తుతం కేరళలోని అందమైన ప్రాంతంలో జరుగుంది.
ఈ సినిమా షుటింగ్ జరుగుతున్న వాటర్ ఫాల్స్ ప్రాంతంలోనే బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతుంది. జక్కన్న కేరళలోని వాటర్ ఫాల్స్ దగ్గర శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తూ శివలింగం ఎత్తిన సీన్స్ చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు బాహుబలి సినిమా హిట్ కావడంలో చాలా ముఖ్యపాత్ర పోషించాయి.
ఇప్పుడు అదే వాటర్ ఫాల్స్ ప్లేస్‍లో పవన్ సర్దార్ సినిమా సంబంధించి ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు పవన్, కాజల్ మధ్య వచ్చే సన్నివేశాలు కావడం వల్ల సినిమాకి ఈ సీన్స్ చాలా కీలకమైనవి అని తెలుస్తుంది. ఈ అధిరిపల్లె వాటర్ ఫాల్స్ ఎంత అందంగా కనిపిస్తాయో అక్కడ షూటింగ్ చేయడం అంతే కష్టం.
అయితే ‘బాహుబలి’ సెంటిమెంట్ ను అనుసరిస్తూ ఇదే వాటర్ ఫాల్స్ దగ్గర ‘సర్దార్’ సినిమా యూనిట్ చాల శ్రమతో ఈ సీన్స్ ను చిత్రీకరించారని టాక్. బాహుబలిలాగే సర్దార్ సినిమాకూడా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందుస్తున్నాడు.