Wednesday, May 15, 2024
- Advertisement -

‘కడప కింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ తరువాత పవన్ చాలా వేంగంగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్నికి పవన్ సన్నిహితుడు సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్నికి సంబంధించి ఓ ఆసక్రికరమైన రూమర్ సినీ పరిశ్రమలో హల్ చల్ చేస్తోంది.

అదేమంటే పవన్ ఎస్ జే సూర్య కాంబినేషన్లో రాబోతున్న చిత్రాన్నికి ‘కడప కింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ ఇప్పటికే ఈ టైటిల్ రిజిష్టర్ కూడా చేయించాడట. మొదటి నుండి డైరెక్టర్ ఎస్ జే సూర్య ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని, ఫ్యాక్షన్ నైపథ్యంలో సాగుతుందని చెబుతూ వస్తుండటంతో ఈ టైటిల్ పుకారు కూడా నిజమేనని అంటున్నారు సినీ జనాలు.

దర్శకుడు కానీ ఈ చిత్ర నిర్మాత కానీ పవన్ నుండి కానీ ఇదే విషయంపై ఇంక ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి ఈ టైటిల్ విషయంపై ఎంతవరకూ వాస్తావం ఉందో తెలియాలి అంటే కొన్ని రోజులవరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ను జూలై నెలలో మొదలుపెట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -