సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. 1950 కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా పవన్ కనిపించనుండా పాన్ ఇండియా లెవల్లో ఓజీ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల కానుండగా పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.
ఈ ఏడాది సెప్టెంబర్ 27న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటివరకు 70 శాతం చిత్రీకరణ పూర్తికాగా మిగిలిన భాగాన్ని ఏపీలో ఎన్నికలు ముగియగానే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఓజీ రిలీజ్ డేట్ కన్ఫామ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకండా పోయాయి.