Monday, May 20, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్..ఒక హిట్, ఒక ప్లాప్..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా దర్శకుడు ఎస్.జె సూర్యకి మంచి పేరు తో పాటు డిమాండ్ పెరిగింది. కానీ సూర్య ఖుషి తర్వాత చేసిన ఏ సినిమా పెద్దగా ఆడాలేదు. అయిన సూర్యకి మరోసారి అవకాశం ఇచ్చాడు పవన్.

అదే కొమరం పులి సినిమాకి చాన్స్ ఇచ్చాడు పవన్ కానీ ఈ సారి భారీ సూర్య ప్లాప్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సూర్య రీసెంట్‍గా ఓ ప్రేమ కథను పవన్‍కు వినిపించాడట. పవన్ కూడా కథ నచ్చడంతో ఈ సినిమా మనం చేద్దాం అని సూర్యతో అన్నాడట. ఇక సూర్య అలస్యం చేయకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో పడ్డాడట.

కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అలోచిస్తున్నారట పులి సినిమా ప్లాప్ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ ఎందుకు సూర్యకి చాన్స్ ఇచ్చాడు అని అనుకుంటున్నారు. మరికొందరు ఈ సారి సూర్య పవన్‍తో ఖుషిలాంటి సినిమా తీస్తాడు అనే వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సింగపూర్‍లో ఉన్నాడు అక్కడ నుంచి వచ్చక సర్దార్ షూటింగ్‍లో పాల్గొంటాడు. ఈ సర్దార్ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు. పవన్ సరసన తొలిసారిగా కాజల్ హీరోయిన్‍గా నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -