పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే ఈ సినిమా టీం కొంత కష్టమైన స్టేజీకి చేరుకున్నారట. అదే ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతుందట.
ఇది కష్టం ఎంటీ అనుకుంటున్నారా? చెప్తా పవన్ పెద్దగా డాన్స్ చేయడం రాదు అని గతంలో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఐతే సర్దార్ గబ్బర్ సింగ్ టాకీ పార్టు చివరి దశకు చేరుకోవడంతో….ప్రస్తుతం పాటల చిత్రీకరణ మొదలు పెట్టారు. సినిమా అన్నాక ఇవ్వన్ని తప్పవు కాబట్టి అభిమానులకోసం అతని బాడీ లాంగ్వేజికి తగిన విధంగా డాన్స్ కంపోజ్ చేయించుకుంటున్నారు.
రెండు పాటలు యూరఫ్ లో ప్లాన్ చేస్తున్నారు మిగిత పాటలను ఇక్కడే చిత్రికరించనున్నారు. ఈ మార్చ్ లో ఈ సినిమా ఆడియో వేడుకను జరప్పుటకు ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలేట్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి సర్దార్ సినిమా అభిమానుల అంచనాలు అందుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు.