Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ సినిమా స్టోరీలైన్ ఇదే..?

- Advertisement -

సర్దార్ గబ్బర్‌సింగ్’తో ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన పవన్.. ఈసారి ఎలాగైనా వారికి హిట్ ఇవ్వాలనే భావనతో అప్పుడే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. ఏప్రిల్ 27వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా స్టోరీలైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమా ఓ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా నడుస్తుందని తెలిసింది. పవన్ ఓ ఫ్యాక్షన్ లీడర్ కాగా.. రాజకీయాల్లో జరుగుతున్న అక్రమాలను ఓవైపు ఎండగడుతూనే.. మరోవైపు అతని లవ్ స్టోరీ కొనసాగుతుందట. హీరోయిన్ కూడా అతనికి సపోర్ట్ చేస్తుందని.. ఈ విషయం తెలుసుకున్న విలన్లు ఆమెను కిడ్నాప్ చేసి పవన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తారని.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ అంటూ ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. మరి.. ఇందులో ఎంతమాత్రం వాస్తవం వుందో తెలియాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ మూవీలో పవన్‌ను ఇంతకుముందెన్నడూ చూపించని విధంగా డిఫ్రెంట్ గెటప్‌లో సూర్య చూపించనున్నాడట. పవన్ ఒక ఫ్యాక్షన్ లీడర్‌గా సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. రీసెంట్‌గా పవన్‌కు సంబంధించిన ఫోటోల్లో కూడా అదే రుజువైంది. క్లీన్ షేవ్‌లో, కళ్లజోడు ధరించి.. కొత్త సినిమాలో తన లుక్ ఏంటన్న విషయంపై హింట్ ఇచ్చేశాడు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -