Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ లుక్ ఎలా ఉంటుందో తెలుసా?

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవ్వాగానే పవన్ కళ్యాణ్ తన లుక్‍ను పూర్తిగా మార్చేశాడు. సినిమాలో కాకుండా రియల్ లైఫ్ లో ఎలాగుంటాడో అలాగే కనిపిస్తున్నాడు పవన్. మీసం తీసేసి.. తెల్లటి జుట్టుతో చాలా వెరైటీగా కనిపిస్తున్నాడు పవన్. ముందు ఈ లుక్ అదోలా అనిపించినా.. ఆ తర్వాత జనాలు అలవాటు పడిపోయారు.

అయితే సినిమాల మధ్య విరామం వచ్చినప్పుడు హీరోలు తమకు నచ్చినట్లు ఉండటం మాములే కాబట్టి జనాలు కూడా ఈ లుక్ను క్యాజువల్ గానే తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్న పవన్ అవతారం మారడం లేదు. ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమాలో పవన్ నటించనున్నాడు. త్వరలో పవన్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అయితే అభిమానులు మాత్రం త్వరలో రాబోతున్న కొత్త సినిమాలో పవన్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి అని ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం పవన్ తన ఒరిజినల్ లుక్ తోనే ఈ చిత్రంలో కనిపించనున్నాడు అని చెపుతున్నారు. తెల్లటి జుట్టును కంటిన్యూ చేస్తూ పెద్ద మీసంతో కనిపిస్తాడట పవన్ ఈ సినిమాలో.

సూర్య దర్శకత్వంలో తాను చేయబోయేది ఓ ఫ్యాక్షనిస్టు లవ్ స్టోరీ అని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదో మిడిలేజ్డ్ పాత్ర కావడంతో పవన్ తెల్లటి జుట్టుతో కనిపిస్తాడట. ఐతే పవన్ లుక్ గురించి సమాచారం చూస్తుంటే.. ఇది తమిళ ‘వీరం” సినిమాకు రీమేక్ అని జరుగుతున్న ప్రచారం వాస్తవమే అనిపిస్తోంది. ఆ సినిమాలో హీరో అజిత్ది కూడా మిడిలేజ్డ్ క్యారెక్టరే. తెల్లటి జుట్టుతోనే కనిపిస్తాడు. అతడికి రౌడీ బ్యాగ్రౌండ్ ఉంటుంది. లేటు వయసులో ప్రేమలో పడతాడు. కాబట్టి పవన్ ‘వీరం” సినిమాను రీమేక్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -