ఓ వైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలతో బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పవన్ నటిస్తున్న పలు సినిమాలు లైన్‌లో ఉండగా తాజాగా గోపిచంద్ మలినేని సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్‌కు పెట్టింది పేరైన గోపీచంద్, ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.రీసెంట్‌తో బాలయ్యతో వీరసింహారెడ్డితో హిట్ కొట్టారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌కు ఓ పవర్‌ఫుల్ కథను వినిపించారని, అది పవన్‌కి నచ్చినట్లు సమాచారం. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పూర్తి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారనట గోపిచంద్.
పవన్ ప్రస్తుతం OG , హరి హర వీర మల్లు ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట గోపిచంద్. మొత్తంగా ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా అధికారిక ప్రకటన వస్తే పవన్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.