Thursday, May 8, 2025
- Advertisement -

పవన్‍ను దెబ్బ కొట్టిన మహేష్?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుందని చెపుతున్నారు ఈ సినిమా యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శరత్ మారార్ నిర్మిస్తున్నాడు.

ఐతే ఈ సినిమా వర్సీస్ రైట్స్ 11 కోట్లకు అమ్మడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడు పోవడంతో పవన్ అభిమానులు తెగ సంతోష పడ్దారు. కానీ పవన్ క్రియేట్ చేసిన రికార్డును మహేష్ బాబు బద్దలు కొట్టాడు. అవును మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఓ సంస్థ 13 కోట్లకు కొనుక్కుని మరో సంచలనం సృష్టించింది.

తెలుగు సినిమా ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి. ఓవర్సీస్‍లో మహేష్ బాబుకు ప్రతేక స్థానం ఉంది అతను నటించిన ప్రతి సినిమా అక్కడ మంచి విజయంతో పాటు కలక్షన్లు కూడా రాబట్టింది. సో మహేష్‍కు ఉన్న క్రేజ్ చూసి ఇంత పెద్ద మొత్తం‍లో కొన్నుకున్నారు అనుకుంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -