- Advertisement -

పెద్ది..యుఎస్ బుకింగ్స్ అప్‌డేట్!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం చివరి దశలో కొనసాగుతోంది.

ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, అమెరికాలో ఏప్రిల్ 29న ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూఎస్‌లో ఈ సినిమాను ప్రథ్యంగిర సినిమాస్ విడుదల చేస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రకటనను “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రదర్శనల సమయంలో వెల్లడించారు. రామ్ చరణ్ బర్త్‌డే రోజున ఒక కీలక ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే బుకింగ్స్ ప్రారంభమై, ప్రీ-సేల్స్‌కు మంచి బూస్ట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, రెండు పాటలకు మంచి స్పందన లభించింది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -