Tuesday, April 30, 2024
- Advertisement -

పూనమ్ కౌర్ టాటూ వెనుక అర్దం ఏంటో తెలుసా ?

- Advertisement -

పూనమ్ కౌర్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈమె ఆధ్యాత్మిక బాటను పట్టారు. సత్యం.. ప్రేమ.. కరుణ అంటూ రకరకాల ముచ్చట పెడుతూ ఫ్యాన్స్ లో కలవరానికి కారణమవుతోంది పూనమ్. అసలు పూనమ్ లో ఇంత మార్పుకి కారణం ఏంటో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నిటికీ కాంట్రాస్టుగా టాట్టూ కల్చర్ తోనూ వేడి పెంచడం ఈ అమ్మడికే చెల్లింది.

ఇంతలోనే అంత విలక్షణత ఏమిటో కానీ.. కాసేపు మతాచారాలు .. పూజలు పునస్కారాలు అంటూ చాలానే హడావుడి చేసేస్తోంది. మత ప్రభోదకుల్ని కలుస్తోంది. సూక్తులు వల్లిస్తోంది. ఉన్నట్టుండి పాశ్చాత్య బాణీలోకి వెళ్లిపోతోంది. తాజాగా తన ఎద అందాల సానువుల్లో టాట్టూ వేయించుకుని షాకిచ్చింది. త్రిశూలం.. తాచు పడగ.. అసలు ఏమిటీ ఈ గుర్తులకు అర్థం? అసలీ టాట్టూ ఎందుకు? అన్న సందేహం కలిగితే అక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఆ టాట్టూ ద్వారా పూనమ్ ఓ బ్రహ్మ రహస్యాన్నే రివీల్ చేస్తోంది.

ఆ త్రిశూలం.. తాచు పడగకు అర్థం సత్యం.. ప్రేమ.. కరుణ అంటూ పెద్ద ట్విస్టే ఇచ్చింది. ఇంతకుముందు పూనమ్ కర్తార్ పూర్ కారిడార్ లోని కటాస్ రాజ్ టెంపుల్ ని సందర్శించింది. అటుపై ఇటీవలే రకరకాల ఆలయాల్ని సందర్శించిన పూనమ్.. టిబెట్ వరకూ వెళ్లి దలైలామాను సందర్శించి ఆశీస్సులు పొందింది. అనంతర కాలంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని పూనమ్ అంతే ఇదిగా గౌరవించింది. అందుకే తనలో ఇంతటి మార్పు. ప్రస్తుతం ఈమె చేతిలో ఏ సినిమాలు కూడా లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -