Saturday, May 3, 2025
- Advertisement -

20 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో త్రిష!

- Advertisement -

టాలీవుడ్ హిట్ కాంబోల్లో ఒకటి ప్రభాస్ – త్రిష. సరిగ్గా 20 ఏళ్ల క్రితం వర్షం సినిమాతో మెప్పించింది ఈ జంట. ప్రభాస్ – త్రిష ఇద్దరికి ఈ సినిమా టర్నింగ్ పాయింట్‌గా మారింది .ఆ తర్వాత పౌర్ణమి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరి జోడి మళ్లీ తెరపై కనిపించనుంది. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా ప్రభాస్ సరసన త్రిషను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష…చిరంజీవితో విశ్వంభర, అజిత్‌తో విడా ముయర్చి , కమల్ హాసన్‌తో థగ్ లైఫ్ సినిమాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో త్రిష అయితే బాగుంటుందని భావించిన సందీప్ ఆమెను ఫస్ట్ చాయిస్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయిత దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి సందీప్ వంగా సినిమాలంటేనే వయోలైన్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్‌కి పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో త్రిష..సందీప్‌తో సినిమాకు ఓకే చెబుతుందా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -