Wednesday, May 22, 2024
- Advertisement -

బాహుబలి లవర్ బోయ్ కానున్నాడా?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనగానే వేంటనే యాక్షన్నే అని అనుకుంటారు. మాస్‍లో ప్రభాస్‍కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆరడుగుల ప్రభాస్ సినిమాలో యాక్షన్ చేస్తేనే బాగుంటుంది. ఈ మాస్ ఫాలోయింగ్ బాహుబలి సినిమాతో మరింత పెరిగిపోయింది. ఐతే ప్రభాస్‍కి మాస్‍లో ఎంత ఫాలోయింగ్ ఉందో క్లాస్‍లో కూడా అంతే పాలోయింగ్ ఉంది.

ఇంత మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ లవర్ బోయ్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించగలమా?  అసలు యాక్షనే లేకుండా సినిమా చేస్తాడని అనుకోగలమా? కానీ ప్రభాస్ పూర్తిగా లవర్‍ బోయ్ పాత్రలో కనిపించబోతున్నాడు. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఇటీవలే స్క్రిప్టు విని ప్రభాస్ ఫైనల్ చేసేశాడట. అసలు యాక్షనే లేకుండా తెరకెక్కనున్న  ఆ చిత్రం ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీతో తెరకెక్కనుందని తెలిసింది.

ఈ సినిమాలో ప్రభాస్ పక్కన కొత్త భామ హీరోయిన్‍గా నటిస్తుందట. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి2 షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రెండు స్క్రిప్టుల్ని పక్కాగా ఓకే చేసి పెట్టాకున్నాడు ప్రభాస్. ఒకటి రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలోనూ మరొకటి రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలోనూ ఉంటుంది. బాహుబలి2 షూటింగ్‍ అయిపోగానే సుజీత్ సినిమా మొదలుపెడతారట. ఈ సినిమా పూర్తి కాకముందే రాధాకృష్ణకుమార్ సినిమా కూడా మొదలుపెడతారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -