Sunday, April 28, 2024
- Advertisement -

ఫస్ట్ లుక్‌తో ప్రభాస్ ప్రాజెక్ట్ కె కొత్త రిలీజ్ డేట్..

- Advertisement -

ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K ఇప్పటివరకు పాన్-ఇండియా స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది. త్వరాలోనే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అలలు సృష్టింబోతుంది. శాన్ డియాగో కామిక్-కాన్‌లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ మరియు దీపికా పదుకొణెతో సహా చిత్ర తారాగణం హాజరవుతారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భాగమైన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. ఇదే వేదికపై సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది.

అయితే ఇప్పటికే జూలై 20 న అమెరికాలో ఫస్ట్ లుక్, గ్లీప్స్ లను మొదట విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించగా ఇప్పుడు నిర్మాతలు వాయిదా వేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ ఇంత పెద్ద వేదికపై విడుదల తేదీని ప్రకటించడం మంచిదని బావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

జూలై 20 నుండి 23 వరకు జరిగే శాన్ డియాగో కామిక్-కాన్‌ సదస్సులో ప్రాజెక్ట్ K ప్రత్యేకమైన ఫుటేజ్ ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సినిమా తారలతో పాటు ప్రాజెక్ట్ K చిత్రంలోని మొత్తం తారాగణం హాజరవుతున్నట్టు సమాచారం.

సి. అశ్వనీదత్ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి “మహానటి” ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దిశా పటాని వంటి భారీ తారాగణం ఇందులో నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -