Friday, March 29, 2024
- Advertisement -

అనారోగ్యంపై స్పందించిన ప్రదీప్ ?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై ఫిమేల్ యాంకర్స్ లో సుమకు ఎంత క్రేజ్ ఉందో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కు కూడా అంతే క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంత కాలం నుంచి ప్రదీప్ బుల్లితెరపై సరిగ్గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో అతనిపై రకరకల కామెంట్స్ వస్తున్నాయి. తన రెమ్యునరేషన్ భారీగా పెంచడం వల్ల ఏ షోకి ప్రదీప్ ని తీసుకోవడం లేదని కొందరు అంటున్నారు.

దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా మరో యాంకర్ రవి ఆ వార్తల్లో అసలు నిజం లేదని చెప్పాడు. అసలు విషయం ఏంటంటే.. ప్రదీప్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని.. ఇప్పుడిప్పుడే సాధరణ స్థితిలోకి వస్తున్నాడని పేర్కొన్నాడు. ’ఢీ జోడిలో’ ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన రవి.. ప్రదీప్ లేకపోవడం గురించి.. అలానే ఆ విషయంపై వస్తున్న రూమర్స్ పై.. చెక్ పెట్టేలా అసలు విషయం చెప్పాడు.

’ అక్టోబరు23న.. ప్రదీప్ పుట్టిన రోజు జరుపుకున్నాడని.. ఆ పార్టీలో మేము కూడా పాల్గొన్నామని తెలిపాడు. ఇక పూర్తిగా కోలుకున్న వెంటనే.. రీ ఎంట్రీ ఇస్తాడన్న రవి చెప్పాడు. అయితే.. ప్రదీప్ కు ఎటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అనేదాని పై చర్చ మొదలైంది.

తాజాగా “తన ఆరోగ్యంకు ఏం కాలేదని.. అనోసరంగా అభిమానులు ఫీల్ కావొద్దు అని.. సోషల్ మీడియాలో వచ్చేవి రూమర్స్ మాత్రమే అని.. తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు.. త్వరలోనే మళ్లీ అందర్ని అలరిస్తానని” ప్రదీప్ చెప్పాడని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైన ప్రదీప్ ఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -