Thursday, May 2, 2024
- Advertisement -

సలార్ స్టోరీ లైన్ ఇదే!

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్టు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక సలార్‌కు పోటీగా షారుఖ్ డంకీ వస్తుండగా ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ప్రభాస్ సలార్‌కు సంబంధించిన స్టోరీ లైన్‌ని రివీల్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా మారి చేసే యుద్ధమే సలార్ అని…ఫస్ట్ పార్టు మొత్తం వీరిద్దరి స్నేహం, ఫైట్ మొదలు వరకు ఉండనుందని తెలిపారు.

సినిమాలో హైలైట్‌గా నిలిచేది భావోద్వేగ సన్నివేశాలని…ఫస్ట్ పార్టు చూసిన తర్వాత సెకండ్ పార్టుపై మరింత హైప్ పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులను పరిచయం చేయగా ట్రైలర్‌లో కథను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సెకండ్ పార్టుకు సంబంధించి చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. మొత్తంగా ప్రభాస్ – పృథ్వి సుకుమారన్ స్నేహం నేపథ్యంలో సలార్ స్టోరీ నడుస్తుందని కన్ఫామ్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -