Friday, May 10, 2024
- Advertisement -

మహేష్ తో రొమాన్స్ చేస్తున్న ప్రియప్రకాష్ వారియర్..!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సూపర్ హిట్స్ జోష్ లో ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహర్షి సూపర్ హిట్ అందుకోగానే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే సరిలేరు తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చేద్దాం అనుకున్నాడు మహేష్. అయితే కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో సీన్ లోకి ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) ఎంటర్ అయ్యాడు.

‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మే 31 న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ మొదట కీర్తి సురేష్ ను ఫిక్స్ చేశారని బాగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు. గతంలో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన బామ. తన కన్ను గీటుతో యూత్ అలరించిన భామ. ఆమె ఎవరంటే ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రంలోని చిన్న సాంగ్ బిట్.. లో కన్ను కొట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్.

ఈమెను ‘మహేష్ 27’ లో హీరోయిన్ గా అనుకుంటున్నారట. అయితే మెయిన్ హీరోయిన్ గా కాదులెండి… సెకండ్ హీరోయిన్ లేదా ఓ కీలక పాత్ర కోసం ఈమెను తీసుకుంటున్నారు. ఈమెకు ప్రస్తుతం అవకాశాలు పెద్దగా లేవు. ఇలాంటి టైములో ఏకంగా మహేష్ సినిమాలో ఛాన్స్ రావడం అంటే మాటలు కాదు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -