ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. తనకు వస్త్రధారణ గురించి.. తనకు ఇష్టమైన ఔట్ ఫిట్స్ గురించి తను చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె అభిప్రాయాలు ఏమిటంటే..
తనకు బికినీలు అంటే చాలా ఇష్టం అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్రత్యేకించి వేసవిలో సముద్ర తీరాల్లో బికినీ ధరించి జలకాలు ఆడుతుంటే అంతకన్నా ఆనందం ఏముండదు అని ప్రియాంక తన ఫీలింగ్స్ గురించి వివరించింది.
ఇక తనకు ఎలాంటి బికినీలు ఇష్టమో కూడా ప్రియాంక వివరించింది. వన్ పీస్ బికీనీల కంటే టూపీస్ బికినీలు ఇష్టమని ప్రియాంక చెప్పింది. టూ పీస్ బికినీల్లో కంఫర్ట్ ఉంటుందని.. వాటిల్లో చాలా హాయిగా ఉంటుందని ప్రియాంక చెప్పుకొచ్చింది. అలాంటి బికినీలే తను కొంటుంటానని ప్రియాంక చెప్పుకొచ్చింది.
మరి ఒక బాలీవుడ్ హీరోయిన్ ఇంత స్పోర్టివ్ గా తను బికినీల మీద ఉన్న మోజు గురించి చెప్పుకోవడంతో అనేక మంది స్టన్ అవుతున్నారు. ఒక వైపు సినిమాల్లో బికినీలు వేసుకోవాలంటే ఎక్స్ ట్రాగా రెమ్యూనరేషన్లు డిమాండ్ చేసే హీరోయిన్ల మధ్య ప్రియాంక ఇలా మాట్లాడటం ఒక తెలుగు బడా ప్రొడ్యూసర్ గమనించాడు.
వెంటనే ఆయన తన సినిమా హీరోయిన్ కు క్లాస్ పీకాడు. “చూడమ్మా.. మీరు ఆదర్శంగా తీసుకొనే బాలీవుడ్ హీరోయిన్ చూడు బికినీపై తనకున్న ఇష్టాన్ని ఎలా చెప్పుకొంటోందో.. మీరూ ఉన్నారు, బికినీ అంటే ఎక్స్ ట్రా డబ్బు కావాలంటారు.. అందులో కూడా వన్పీస్ అయితే ఒకరేటు, టూ పీస్ అయితే మరో రేటు.. అంటారు…” అంటూ నిర్మాతన నిష్కర్షగా మాట్లాడేశాడు. ఇదంతా వింటూ విస్తుపోవడం ఆ హీరోయిన్ వంతు అయ్యింది!