Thursday, March 28, 2024
- Advertisement -

పెళ్లే కాలేదు.. తల్లి కావాలనుకుంటోంది

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా వ్యవహారం.. టాక్ ఆఫ్ ద బీ టౌన్ అవుతోంది. బాలీవుడ్ సినిమాలో నటించినా.. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హోస్ట్ గా వ్యవహరించినా.. ఆ మాటకొస్తే.. ఏం చేసినా.. ప్రియాంక వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా.. తన నోటికి కాస్త పని చెప్పి.. హెడ్ లైన్స్ లో చోటు కొట్టేసింది పిగ్గీ చాప్స్. ఇంతకీ ఏం మాట్లాడి ప్రియాంక మళ్లీ సెన్సేషన్ అయ్యిందనే కదా మీ డౌట్.. అయితే ఈ న్యూస్ తెలుసుకోవాల్సిందే.

చిన్నప్పటి నుంచీ తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని.. 18 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి తల్లిని కావాలని అనుకుంటున్నాననీ.. ప్రియాంక రీసెంట్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఓ క్రికెట్ టీమ్ కు సరిపడా పిల్లల్ని తనే కనాలని ఆశగా ఉందని చెప్పింది.

పిల్లలపై తనకున్న అభిమానాన్ని చూసి.. ఫ్రెండ్స్ కూడా వారి కిడ్స్ ను తన దగ్గరే వదిలి వెళ్తుంటారని కూడా ప్రియాంక చెబుతోంది. చిన్నారుల గలగలలు ఉంటేనే.. ఇల్లు పరిపూర్ణమవుతుందన్నది తన నమ్మకంగా చెప్పుకొచ్చింది. అందుకే.. చాలా కాలంగా పిల్లల్ని కనాలనుకున్న కోరిక కలుగుతోందన్న అర్థం వచ్చేలా మాట్లాడింది.

అయితే.. ఇప్పటికీ ప్రియాంక చోప్రా సింగిల్ గానే ఉంటోంది. ఇంకా పెళ్లి కూడా కాలేదు. కనీసం లవర్ ఉన్నట్టు గాసిప్పో, రూమరో ప్రచారమూ లేదు. కానీ.. పిల్లలపై మాత్రం ఆమె మనసు ఆరాటపడుతోంది. అందుకే.. హాయిగా వయసు మీద పడక ముందే.. ఎవర్నో ఒకర్ని చేసేసుకుని పిల్లల్ని కనేయొచ్చుగా అని చాలామంది ఆమెకు సలహా ఇస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -