Wednesday, May 15, 2024
- Advertisement -

చిరు 150వ సినిమాలో విలన్ రాధిక?

- Advertisement -

టాలీవుడ్ లో ఒకప్పటి సూపర్ హిట్ పెయిర్ చిరంజీవి రాధిక. ఈ ఇద్దరూ ఇప్పుడు కలిసి నటిస్తున్నారంటే.. ఫ్యాన్స్ తో పాటు మిగతా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కలగడం కామన్. ఇప్పటికీ ప్రపోజల్స్ స్టేజ్ దాటని చిరంజీవి 150వ సినిమాకు.. ఇలాంటి వార్తకు ఉన్న ఓ లింక్.. ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది.

చిరంజీవి రాధిక మధ్య ఇప్పటికీ మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. సందర్భం వస్తే చాలు.. గతం గుర్తు చేసుకోవడం.. ఇద్దరూ ఒకరిపై ఒకరు జోకులేసుకోవడం కూడా కామన్. అదే చనువుతో.. ఈ మధ్యే చిరంజీవితో మాట్లాడిన రాధిక.. తనకు మెగాస్టార్ 150వ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశారట.

రాధిక ప్రపోజల్ ఊహించని చిరు.. మంచి విలన్ క్యారెక్టర్ ఉంటే తప్పకుండా ఇప్పిస్తానని బదులిచ్చారట. ఆ వెంటనే రియాక్ట్ అయిన రాధిక.. తనకు విలన్ క్యారెక్టర్ కాదు.. సినిమాలో ముఖ్యమైన రోల్ అయి ఉండాలని కాస్త గట్టిగానే అడిగారట. ఈ ప్రపోజల్ కు చిరు ఓకే చెప్పారో లేదో తెలియదు కానీ.. ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తే బాగుంటుందని టాలీవుడ్ జనాలంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -